ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో విద్యాసంస్థల బంద్ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. P3 విధానం వల్ల పేదలు ఉచిత వైద్య విద్య వైద్యం కోల్పోతారని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కాపురం మెడికల్ కాలేజీని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేసి ప్రభుత్వమే నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు.