రాయదుర్గం: 74 ఉడేగోళం గ్రామంలో వారం రోజులుగా నిర్వహించిన జూ.కాలేజీ NSS వాలంటీర్ల ప్రత్యేక క్యాంపు నేటితో ముగింపు
రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు 7 రోజులుగా 74 ఉడేగోళం గ్రామంలో చేపట్టిన ప్రత్యేక క్యాంపు ఆదివారం సాయంత్రం ముగిసింది. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు గ్రామంలో వీధులన్నీ శ్రమదానం చేసి చెత్తరహిత ప్రాంతాలుగా మార్చేశారు. హైస్కూల్, మద్దానేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే దారిలో ఇరువైపులా పెరిగిన కంపచెట్లు, పిచ్చి మొక్కలను తొలగించి రోడ్డు పక్కన చెట్లు నాటి సుందరంగా తీర్చిదిద్దారు. ప్లాస్టిక్ వాడకంవల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ చైతన్య పరచారు. ముగింపు సభలో ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, గ్రామపెద్దలు బసవరాజు, జయన్న, అప్పాజీ, హైస్కూల్ హెచ్ ఎం హేమలత, సర్పంచ్ పాల్గొన్నారు.