ఒంగోలు పట్టణంలో ఆటో డ్రైవర్లకు పోలీసులు బుధవారం కౌన్సిలింగ్ ఇచ్చారు. నిబంధనలు పాటిస్తూ ఆటోలు నడపాలని ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని పోలీసులు డ్రైవర్లకు తెలిపారు. అంతేకాకుండా ఆటోలు నడిపే సమయంలో యూనిఫామ్ వాడాలని వాహన సంబంధిత ధ్రువపత్రాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని తెలిపారు. ఆటోలలో అనుమానస్పదంగా ప్రయాణిస్తూ ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆటో డ్రైవర్లకు పోలీసులు తెలిపారు.