కుందేరు గ్రామపంచాయతీ శివారులో పందెం రాయుళ్ల అరెస్టు
Machilipatnam South, Krishna | Sep 14, 2025
కంకిపాడు మండలం కుందేరు గ్రామపంచాయతీ శివారులో ఆదివారం కోడిపందాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 8 మంది నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 10,300 రూపాయల నగదు, రెండు కోడి పుంజులు, 11 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కత్తులు కట్టి నిర్వహిస్తున్న పందేలపై సమాచారం అందుకున్న పోలీసులు ఈ చర్యలు చేపట్టారు.