పోలీసు బలగం ఎల్లప్పుడూ ప్రజల రక్షణకై తుపాకులను క్రమశిక్షణగా వాడుతుంది : చిత్తూరు ఎస్పీ
Chittoor Urban, Chittoor | Oct 2, 2025
చిత్తూరు జిల్లా పోలీస్ సిబ్బంది మరియు ప్రజలకు చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. విజయ్ దశమి పురస్కరించుకొని చిత్తూరు జిల్లా ఏఆర్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఘనంగా ఆయుధ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ బలగం ఎల్లప్పుడూ ప్రజల రక్షణకై తుపాకులను క్రమశిక్షణగా వాడుతుందని అన్నారు విజయదశమి పర్వదినం చెడుపై నుంచి విజయం సాధించడానికి ప్రతీకాని ఈ సందర్భంగా సాయుధ పోలీస్ కార్యాలయంలో చేసిన ఘనమైన ఏర్పాట్లను ప్రశంసిస్తూ ప్రజలు శాంతి సుఖసంతోషాలతో ఉండటం పోలీసుల ప్రధమ కర్తవ్యం అన్నారు.