ప్రభుత్వం నుంచి రీఫర్ కంటైనర్‌కు రూ.10,000/- ప్రోత్సాహకాన్ని అందించడానికి సిద్ధంగా ఉందని, ఎగుమతిదారులు రైలు ద్వారా అరటిపండ్ల రవాణాను వీలైనంత త్వరగా ప్రారంభించాలని ఇంచార్జి జిల్లా కలెక్టర్ సి.విష్ణు చరణ్ ఆదేశించారు. గురువారం రాత్రి 7:30 గంటల సమయం లో అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి రైల్వే ద్వారా తాడిపత్రి నుండి జెఎన్‌పిటి పోర్టుకు అరటి ఎగుమతులను ప్రారంభించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఉద్యాన శాఖ అధికారులు, గుంతకల్లు రైల్వే డివిజన్ అధికారులు, కాన్ కార్ మరియు అరటి ఎగుమతిదారులు, వాటాదారులతో ఇంచార్జి జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.