మంచిర్యాల జిల్లా హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముల్కల్ల గ్రామం వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేములవాడ నుంచి తిరిగి వస్తున్న ఒక కుటుంబం కారును, మంచిర్యాల నుంచి ముల్కల్ల వైపు వెళ్తున్న కొండల్ రెడ్డి కారు ఢీకొట్టింది. కొండల్ రెడ్డి అజాగ్రత్త కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఎస్సై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.