పులివెందుల: ఆగూడూరులో ఆరుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్
Pulivendla, YSR | Oct 29, 2025 చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే ఉపేక్షించమని తొండూరు ఎస్సై ఘన మద్దిలేటి తెలపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆగుటూరు గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో దాడులు చేశామని చెప్పారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వారి వద్ద నుంచి రూ. 1630 నగదును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అరెస్టు చేసిన నిందితులను రిమాండ్ కు పంపినట్లు చెప్పారు.