చీమకుర్తి మండలం గోనుగుంటలో స్వయంభుగా వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు హనుమాన్ ప్రసాద్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భక్తులందరూ ఉత్తర ద్వారం ద్వారా దర్శనం స్వామివారి దర్శించాలన్నారు. ముందుగా స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తున్నామన్నారు. భక్తులందరూ వైకుంఠ ఏకాదశి వేడుకల్లో పాల్గొని, స్వామిని దర్శించుకుని, స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.