హిమాయత్ నగర్: ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు నిర్మించి ఇస్తాం: మాజీ మంత్రి కేటీఆర్
కూకట్పల్లిలోని అల్లాపూర్ సున్నం చెరువు వద్ద హైడ్రా బాధితులతో కలిసి మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం సాయంత్రం దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తో కలిసి చిన్నారులకు టపాసులు పంచిపెట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూల్చడం తప్ప ఎక్కడ కట్టడం లేదని విమర్శించారు. ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. హైడ్రా బాధితులకు అండగా ఉంటామని తెలిపారు.