అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని కృష్ణంరెడ్డిపల్లి గ్రామం వద్ద నాలుగు గంటల సమయంలో సిపిఐ పార్టీ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిపిజిల్లా కార్యవర్గ సభ్యుడు రామకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరై సిపిఐ పార్టీ జెండాను ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు రామకృష్ణ మాట్లాడుతూ సిపిఐ పార్టీ ఆవిర్భావం నుంచి పేదల ఇళ్ల స్థలాలు భూములు కోసం పోరాటాలు చేయడం జరిగిందని రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా పేదల పక్షాన సిపిఐ పార్టీ ఎప్పుడు పోరాటాలు చేస్తూనే ఉంటుందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రామకృష్ణ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలంతా పాల్గొన్నారు.