ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లె మండలం నేరేడుపల్లిలో 2003-04 సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు గురువారం పాఠశాలలో కలుసుకున్నారు. వారికి చదువు చెప్పిన గురువులను ఆహ్వానించి వారి పాత మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. వారి జీవన విధానాలకు సంబంధించిన వివరాలను చర్చించుకుంటూ ఆనందంగా గడిపారు. తమకు చదువు చెప్పిన గురువులను సత్కరించారు.