గద్వాల్: జిల్లాలో విత్తన పత్తి రైతులను మోసం చేస్తున్న ఆర్గనైజర్లపై చర్యలు తీసుకోవాలి:జిల్లా ఛైర్మన్ గొంగళ్ల రంజిత్
విత్తన పత్తి రైతులను మోసం చేస్తున్న ఆర్గనైజర్లపై చర్యలు తీసుకోవాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా ఛైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం మధ్యాహ్నం గద్వాలలో ఆయన బాధితులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ధరూర్ మండలం గుడ్డెం దొడ్డికి చెందిన రైతులు పండించిన పత్తికి పేమెంట్ ఇవ్వకుండా ఆర్గనైజర్లు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు