సంగారెడ్డి: పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని కోరుతూ సదాశివపేటలో పిడిఎస్ యు ఆధ్వర్యంలో ర్యాలీ
స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని కోరుతూ పిడిఎస్ యు ఆధ్వర్యంలో విద్యార్థులు సదాశివపేట పట్టణంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించి, తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన విద్యార్థులు, తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగుతుందని నాయకులు తెలిపారు.