శ్రీకాకుళం: తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలన్న ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం బసవరాజు
తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లో పనిచేస్తున్న కెప్టెన్స్ (డ్రైవర్లు) కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.బసవరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం శ్రీకాకుళంలోని CITU కార్యాలయంలో అవగాహన సదస్సు జరిగింది. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహానాలతో మారుమూల ప్రాంతాల్లో సమయంతో నిమిత్తం లేకుండా సేవలందిస్తున్నామని, సేవలను ప్రభుత్వం గుర్తించాలన్నారు.