దీపావళి పండుగ సందర్భంగా కుషాయిగూడ కీసర ప్రదన రహదారిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పూలు, పండ్లు, పండుగ సరుకులు కొనుగోలు చేసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు వాహనాలతో రోడ్డు మీదకు రావడంతో రహదారి పూర్తిగా కిక్కిరిసిపోయింది. వాహనదారులు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు. పండుగ వేళా సొంత ఊర్లకు వెళ్లే వారితో రోడ్లపైకి రావడంతో రద్దీ అధికమైంది.