నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలో భారీ వర్షం రోడ్లపైకి నీరు
Nirmal, Nirmal | Sep 17, 2025 నిర్మల్ జిల్లా కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా శాంతినగర్ ఎక్స్ రోడ్ వద్ద నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై నిలిచిన నీటిని తొలగించి, రవాణాకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.