గిద్దలూరు: గిద్దలూరులో ఏర్పాటుచేసిన దీపావళి టపాసుల మందు సామాగ్రి విక్రయించే దుకాణాలను పరిశీలించిన సీఐ సురేష్, చంద్రశేఖర్
ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఏర్పాటుచేసిన దీపావళి టపాసుల దుకాణాలను ఆదివారం గిద్దలూరు సీఐ సురేష్, అగ్నిమాపక శాఖ అధికారి చంద్రశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిబంధనల మేరకు దుకాణాలు ఏర్పాటు చేశారా లేదా అని అంశాన్ని పరిశీలించి దుకాణదారులకు అధికారులు సూచనలు సలహాలు ఇచ్చారు. అనుమతులు లేకుండా దీపావళి మందు సామాగ్రి విక్రయిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని దుకాణదారులను అధికారులు హెచ్చరించారు.