మేడ్చల్: భారీ వర్షాలతో మేడ్చల్ జిల్లాలో అలుగు పాడుతున్న పలు చెరువులు
భారీ వర్షాలతో మేడ్చల్ జిల్లాలోని పలు చెరువులు పరవళ్ళు తొక్కుతున్నాయి. గురువారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మేడ్చల్ పెద్ద చెరువు, షామీర్పేట్ పెద్ద చెరువు భారీగా అలుగు పారుతోంది.. మేడ్చల్, డబుల్ పూర్, నూతనకల్, ఎల్లంపేట, గౌడవెల్లి, పూడూరు చెరువుల నుంచి షామీర్పేట చెరువుకు భారీగా వరద వచ్చి చేరడంతో నిండింది. అటు లక్ష్మాపూర్, ఉద్దే మర్రి చెరువులు భారీగా ఆలుగు పారుతున్నాయి.