కుప్పం: సీఎం చెప్పినా పట్టించుకోవడం లేదు : మోహన్
పశువుల మేత భూమికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూమిని ఇవ్వాలని సీఎం చంద్రబాబు చెప్పినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని గుడిపల్లి మండలంలోని కమ్మగుట్టపల్లికి చెందిన మోహన్ బుధవారం ఆవేదన వ్యక్తం చేశాడు. సీఎం చెప్పి 15 నెలలు కావస్తున్న తనను కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారని చెప్పారు. తాను ఆత్మహత్య చేసుకుంటే తన కుటుంబానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందని ఆరోపించారు.