మార్కాపురం: గాంధీ పార్కులో గంజాయి సేవించి యువకులు బీభత్సం, అడ్డుగా వెళ్లిన స్థానికులపై బెదిరింపులు
ప్రకాశం జిల్లా మార్కాపురం గడియారం స్తంభం సెంటర్లోని గాంధీ పార్కులో గంజాయి సేవించిన యువకులు బీభత్సం సృష్టించారు. గంజాయి మత్తులో యువకులు తీవ్రంగా కొట్టుకున్నారు. సుమారు గంటపాటు కొట్టుకుంటున్న సమయంలో స్థానికులు తప్పించడానికి వెళ్తే అడ్డం వచ్చిన వారిపై ఎదురు తిరిగారు. దీంతో వారు ఏమి చేయలేక పక్కకు వెళ్లిపోయారు. ఇలాంటి పరిస్థితి రాకుండా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.