నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్టు ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని ASF ఎస్సై కమలాకర్ పేర్కొన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి ధ్రువపత్రాలు లేని 22 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 30 లీటర్ల గుడుంబాను ధ్వంసం చేసి ఇద్దరిపై కేసు నమోదు చేశారు.ఎస్ఐ మాట్లాడుతూ.. ప్రజల రక్షణే పోలీసుల బాధ్యత అని, ప్రజలందరూ పోలీసులకు సహకరించాలన్నారు. యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని చెప్పారు.