నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ రాష్ట్రంలో పెన్షనర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు వంగాల దస్తగిరి రెడ్డి హామీ ఇచ్చారు. ఆళ్లగడ్డలో బుధవారం నిర్వహించిన తాలూకా స్థాయి పెన్షనర్స్ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కలిసి ఉన్న సమయంలోనే జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఏర్పాటు చేసి పెన్షనర్స్ సమస్యల పట్ల పోరాటం చేశామన్నారు.