మంథని: శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన సింగరేణి ఓసిపి-1 భద్రకాళి ఆలయం
ఓసి1 ఫేస్-2 లోని శ్రీ భద్రకాళి ఆలయంలో సోమవారం మధ్యాహ్నం నుంచి అక్టోబర్ 2 వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించడానికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సర్వాంగ సుందరంగా రంగులు వేసి ముస్తాబు చేయడం జరిగింది. వరంగల్ భద్రకాళి ఆలయం తదుపరి రెండవ ప్రసిద్ధ ఆలయంగా నిత్య పూజలు అందుకుంటున్న ఓసి1 ఫేస్-2 లోని శ్రీ భద్రకాళి ఆలయంలో వార్షికోత్సవాలతోపాటు అన్ని విశేష దినములలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు 11రోజులపాటు 11అవతారాల్లో భక్తులకు దర్శనమిస్తారని భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ సముద్రాల విజయసారధి తెలిపారు