తాడికొండ: శ్రావణ్ కుమార్ నామినేషన్ కు తరలిన కార్యకర్తలు.
శ్రావణ్ కుమార్ నామినేషన్ కు తరలిన కార్యకర్తలు. తాడికొండ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ నామినేషన్ కార్యక్రమానికి శుక్రవారం ఫిరంగిపురం మండలం పలు గ్రామాల నుంచి టీడీపీ,జనసేన,బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించి బయలుదేరారు. రానున్న ఎన్నికల్లో అందరూ సమిష్టిగా కలిసి ఉండి శ్రావణ్ కుమార్ ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని నాయకులు తెలిపారు.