నెల రోజులుగా హాస్టల్లో నాణ్యమైన భోజనం అందించడం లేదని ఆరోపిస్తూ OU లా కళాశాల విద్యార్థులు ప్రధాన రహదారిపై బైఠాయించారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, పురుగుల అన్నం పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. "రాళ్లు, పురుగుల అన్నం మాకా.. పెరుగన్నం మీకా" అంటూ నినాదాలు చేశారు. వీసీ ప్రొఫెసర్ కుమార్ వచ్చి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.