కొడంగల్: ఏర్పు మల్ల ప్రభుత్వ పాఠశాలలో సైబర్ క్రైమ్ ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించిన షీ టీం సభ్యులు
ఎస్పీ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం బొమ్మరేస్పేట్ మండల పరిధిలోని ఏర్పుమల్ల గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పరిగి సబ్ డివిజన్ షీ టీం ఇన్చార్జి నర్సింలు, ఆధ్వర్యంలో పోలీస్ కళాబృందం సైబర్ క్రైమ్ ఆన్లైన్ మోసాల పట్ల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాల్య వివాహాల నిర్మూలన, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని తెలిపారు. మద్యపాన నిషేధం, కమ్యూనిటీ పోలీసింగ్, మానవ అక్రమ రవాణా పై అవగాహన కల్పించామన్నారు. సైబర్ క్రైమ్, ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. బాల్య వివాహ