తాడికొండ: కాంగ్రెస్ బీఫాం అందుకున్న తాడికొండ అభ్యర్థి..
కాంగ్రెస్ బీఫాం అందుకున్న తాడికొండ అభ్యర్థి తాడికొండ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సుశీల్ రాజా బుధవారం ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేతుల మీదుగా పార్టీ బీఫాం అందుకున్నారు. తాడికొండలో ఎమ్మెల్యే గా గెలవాలని ఈ సందర్భంగా షర్మిల సుశీల్ రాజాకు సూచించారు. రెండు రోజులు క్రితం తాడికొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మార్చిన విషయం తెలిసిందే. త్వరలో సుశీల్ రాజా నామినేషన్ వేయనున్నట్లు చెప్పారు.