కళ్యాణదుర్గం: కూటమి నాయకుల అరాచకాలకు చెక్ పెట్టేందుకు డిజిటల్ బుక్ ఏర్పాటు చేశాం: కుందుర్పిలో వైసీపీ మండల కన్వీనర్ హనుమంత రాయుడు
కుందుర్పి మండల కేంద్రంలో వైసీపీ నాయకులు మంగళవారం డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ స్కానర్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైసీపీ మండల కన్వీనర్ హనుమంతరాయుడు, వైస్ ఎంపీపీ భీమిరెడ్డి మాట్లాడారు. కూటమి నాయకుల అరాచకాలకు చెక్ పెట్టేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ డిజిటల్ బుక్కును ఏర్పాటు చేశారన్నారు. ఇకనుంచైనా కూటమి నాయకులు తమ తీరును మార్చుకోవాలన్నారు.