గిద్దలూరు స్వచ్ఛ గిద్దలూరు గా మార్చి అభివృద్ధి చేస్తామని ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. శనివారం ఉదయం 10 గంటలకు పట్టణంలో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాల్గొని ప్రజలకు శుభ్రతపై అవగాహన కల్పించారు. అనంతరం గిద్దలూరు నగర పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలపై వివరిస్తూ మీడియాతో ఆయన మాట్లాడారు. అధికారులతో కలిసి గిద్దలూరు అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పేర్కొన్నారు.