రాజేంద్రనగర్: మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం కేసుల్లో ఇద్దరికి రిమాండ్ విధించినట్లు పోలీసులు వెల్లడి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు అధికారులు చోరీ కేసులో ఇద్దరిని రిమాండ్ కు తరలించారు. ఆగపల్లి సమీపంలో క్రషర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు టన్ను బరువైన ఇనుప సామాగ్రిని దొంగలించారు. సూపర్వైజర్ ఫిర్యాదు మేరకు పోలీస్ అధికారులు కేసు నమోదు చేశారు. హయత్ నగర్ బంజారా కాలనీకి చెందిన గోపి, దేవరకొండకు చెందిన రాజును నిందితులుగా గుర్తించి రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు.