ఏసీబీ వలలో అవినీతి తిమింగలం, డోన్ డిప్యూటీ తహసిల్దార్ రైతు వద్ద లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
Dhone, Nandyal | Nov 11, 2025 నంద్యాల జిల్లా డోన్ తహసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్ గా పనిచేస్తున్న సునీల్ రాజ్ జగదుర్తి గ్రామానికి చెందిన వేణుగోపాల్ అనే రైతుకు చెందిన చుక్కల భూమి రెగ్యులర్ చేయడానికి 35 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వకుంటే ఫైలు పక్కకు పెట్టేస్తానని డిప్యూటీ తహసిల్దార్ రైతును బెదిరించాడు. దీంతో విసుకు చెందిన రైతు వేణుగోపాల్ ఈసీబీ అధికారులను ఆశ్రయించాడు .మంగళవారం ఏసీబీ డీఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో డిప్యూటీ తాసిల్దార్ సునీల్ రాజు 35 వేల రూపాయల లంచం రైతు వద్ద నుండి తీసుకుంటుండగా పట్టుకుని రిమాండ్కు తరలించారు