కుప్పం: ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ
గుడిపల్లె మండలంలోని గుడివంక వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయ పునర్నిర్మాణానికి ఎమ్మెల్సీ శ్రీకాంత్ పూజలు నిర్వహించారు. గుడివంక ఆలయ నిర్మాణానికి రూ. 4.87 కోట్లు, కొండ కింద ఉన్న గంగా ధైరాశ్వర ఆలయ నిర్మాణానికి రూ. 1.87 కోట్లను సీఎం చంద్రబాబు మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు. రూ. 54 కోట్లతో 11 ఆలయాల అభివృద్ధి, టీటీడీ ఆధ్వర్యంలో 142 ఆలయాల అభివృద్ధికి చర్య లు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.