నాగలాపురంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చిత్రపటాలు దగ్ధం
నాగలాపురంలో ట్రంప్ చిత్రపటాలు దగ్ధం భారతదేశం ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలకు వ్యతిరేకంగా నాగలాపురంలో ట్రంప్ చిత్రపటాన్ని సోమవారం మధ్యాహ్నం దగ్ధంచేసి నిరసన తెలిపారు. మండల సీపీఎం కార్యదర్శి మురుగేశ్ మాట్లాడుతూ.. ట్రంపు పూర్వం మనదేశ ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతయ్యే సందర్భంలో 11శాతం ఉన్న పన్నును ట్రంప్ వచ్చిన తర్వాత 50 శాతానికి పెంచడం దారుణమన్నారు. ఆక్వా, పత్తి, చేపల రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు.