ములుగు: మేడారం జాతర పనులను ఎస్పీ తో బైక్ పై వెళ్ళి పరిశీలించిన మంత్రి సీతక్క
Mulug, Mulugu | Sep 14, 2025 మంత్రిననే హోదాను పక్కనబెట్టి సాధారణ వ్యక్తిగా వ్యవహరించడం మంత్రి సీతక్క నైజం. ఎప్పుడూ ప్రజల మధ్య ఉండే ఆమె ఆర్భాటాలకు దూరంగా ఉంటారు. నేడు ఆదివారం రోజున మేడారం జాతర పనుల పర్యవేక్షణకు వెళ్లిన మంత్రి ములుగు SP శబరీష్ బుల్లెట్ బైక్ నడుపుతుండగా వెనుక కూర్చొని జాతర జరిగే పరిసరాలను పరిశీలించారు. రోడ్లు, పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ ఏర్పాట్లపై సమీక్షించారు. జాతర నిర్వహణకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.