నల్గొండ: దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ సంబరాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సోమవారం సాయంత్రం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ సంబరాలు నిర్వహించుకునే ప్రాంతాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పటిష్టమైన భద్రత ఏర్పాట్లను చేయడం జరిగిందని తెలిపారు. మండపాల నిర్వాహకులు 24 గంటలు అప్రమత్తంగా ఉంటూ పోలీసు వారికి సహకరించాలన్నారు. మండపాల వద్ద విద్యుత్ వైర్ల సమస్యలు లేకుండా చూసుకోవాలన్నారు. ఈవ్ టీజింగ్ కు పాల్పడే వారి పట్ల ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనుమానితులు కనిపిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు.