పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా టిడిపి అధ్యక్షుడిగా ఎన్నికైన ఉగ్ర నరసింహారెడ్డికి ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తనపై నమ్మకం ఉంచి జిల్లా అధ్యక్షుడు పదవిని ఇవ్వడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలో 2024 ఎన్నికలలో కోల్పోయిన రెండు ఎమ్మెల్యే సీట్లను కూడా 2029లో సాధిస్తామని ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు.