వెంకటగిరి బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు అమర వీరులకు నివాళులర్పించారు
Gudur, Tirupati | Oct 21, 2025 వెంకటగిరి పట్టణంలోని బాలికల గురుకుల పాఠశాలలో సోమవారం సాయంత్రం పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. పోలీసుల అంకితభావం వలనే రాష్ట్ర అభివృద్ధికి బలమైన భద్రత ఏర్పడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం విద్యార్థులు, పోలీస్ సిబ్బందితో కలిసి ఆయన కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించారు.