కర్నూలు: లింగ నిర్ధారణ, బ్రూణ హత్యలు చేస్తున్న హాస్పిటల్‌ను సీజ్ చేయాలి – DYFI
గర్భిణీ స్త్రీలకు లింగ నిర్ధారణ పరీక్షలు, బృద్ధ హత్యలు జరుపుతున్న మనం హాస్పిటల్‌పై వెంటనే చర్యలు తీసుకుని సీజ్ చేయాలని DYFI డిమాండ్ చేసింది. సోమవారం డివైఎఫ్ఐ న్యూ సిటీ కమిటీ నాయకులు జిల్లా స్పెషల్ కలెక్టర్ అనురాధకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా DYFI నగర కార్యదర్శి హుస్సేన్ భాష మాట్లాడుతూ ప్రభుత్వ నియమాలను ఉల్లంఘిస్తున్న హాస్పిటల్‌పై వైద్య ఆరోగ్య శాఖ విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఇమ్రాన్, విజయ్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.