రాయదుర్గం: పట్టణంలోని సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో లక్ష దీపోత్సవానికి తరలివచ్చిన భక్తులు
రాయదుర్గం పట్టణంలోని ప్రసిద్ధి చెందిన శ్రీ సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో కార్తీక లక్ష దీపోత్సవం అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహించారు. బుధవారం కార్తీక దీపోత్సవం సందర్భంగా ఆలయంలో మూల విరాట్టుకు ఉదయం అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు, విశేష అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. రాత్రి ముందుగా జ్వాలాతోరణం వెలిగించారు అనంతరం వందలాది మంది మహిళా భక్తులు లక్ష దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.