రాయచోటిలో ప్రజల సమస్యలు పెరుగుతున్నా… అధికారులు మాత్రం మౌనం:జాతీయ బీసీ సంక్షేమ శాఖ అధ్యక్షురాలు దివిటి పద్మ యాదవ్ ఆవేదన
రాయచోటి, మంగళవారం: రాయచోటి పట్టణంలోని మదనపల్లి రోడ్ ఎ.జి. గార్డెన్ ప్రాంతంలో అధికారులు చూపుతున్న నిర్లక్ష్యం ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని జాతీయ బీసీ సంక్షేమ శాఖ అధ్యక్షురాలు దివిటి పద్మ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.రోడ్డుకు ఇరువైపులా బొంకులు ఏర్పాటు చేయడంతో అక్కడి నివాసితులు ఇళ్లలోకి వెళ్లేందుకు కూడా సరైన మార్గం లేక ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆక్షేపించారు. ఈ సమస్యపై పలుమార్లు ఎంఆర్పీ, మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అధికారులు సమస్యపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్టు స్పష్టమవుతోందని మండిపడ్డారు.