ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు టిడిపి ఎస్సీ సెల్ నియోజకవర్గ ఇన్చార్జి బూరాల జాన్ డేవిడ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పశ్చిమ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతీయడం సరైనది కాదని, జిల్లా కోసం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడారన్నారు. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.