రోడ్డు ప్రమాదంలో వాలంటీర్ మృతి
రేగిడి మండలం కుమ్మర అగ్రహారం సమీపంలో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుడు పాతపట్నం మండలం కోయకొండకు చెందిన వాలంటీర్ షణ్ముఖరావుగా గుర్తించారు. తన వివాహా నిమిత్తం పెళ్లి కార్డులు పంచేందుకు వెళుతుండగా, ఈ దుర్ఘటన జరిగింది. క్షతగాత్రులను 108లో రాజాం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.