మహదేవ్పూర్: మహదేవపూర్ లో గిరిజన డైలీ వైజ్ ఉద్యుగుల నిరావదిక సమ్మె
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని గిరిజన బాలుర వసతి గృహం ఎదుట జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాల, హాస్టల్ లో డైలీ వేజ్ వర్కర్ల నిరవధిక సమ్మె చేపట్టారు. ఉద్యోగ సమస్యలు పరిష్కారానికై సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ ఉద్యోగం పర్మినెంట్ చేయాలని, టైం స్కేల్ చేయాలని, పూర్తి కాలంలో పనిచేస్తున్న వారందరికీ పూర్తి వేతనాలు ఇవ్వాలని, 64 జీవో ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాల నుంచి 43 మంది ర్యాలీగా బయల్దేరి మహాదేవపూర్ తాహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు.