మునిపల్లి: అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని మునిపల్లి మండలం మక్త క్యాసారం గ్రామ శివారులో బుధవారం ఆర్టిసి బస్సు అదుపుతప్పి గుంతలోకి దూసుకెళ్లింది. స్థానికులు తెలిసిన వివరాల ప్రకారం మక్త క్యాసారం నుండి సంగారెడ్డి వైపు వెళ్తున్న బస్సు అదుపుతప్పింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును నిలిపివేశారు దీంతో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.