కలికిరిలో ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొని భార్య మృతి-భర్తకు గాయాలు
కలికిరి మండలం కలికిరి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన నూరుల్లా ఆయన భార్య షరీఫా అలియాస్ వసంత బ్యాంకుకు వెళ్లి నగదు తీసుకుని తిరిగి ఇంటికి ఆర్టీసీ బస్టాండ్ నుంచి క్రాస్ రోడ్ వైపున వెళుతుండగా అంబేద్కర్ విగ్రహం సమీపంలో, ఎడమ వైపు నుండి విశ్వకర్మ ఊరేగింపు జరుగుతుండగా కుడి వైపు నుంచి వాహనాలు రాకపోకలు సాగిస్తున్నారు.కలికిరి బస్టాండ్ వైపు నుంచి క్రాస్ రోడ్ వైపు వెలుతున్న మదనపల్లి 2డిపో ఆర్టీసీ బస్సు వీరి ద్విచక్ర వాహనంను ఓవర్ టేక్ చేసే క్రమంలో వీరి ద్విచక్ర వాహనంను ఢీకొని క్రింద పడ్డారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే భార్య మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భర్తకు ప్రాణహాని లేదు