అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ప్రజలను మభ్య పెట్టే విధంగా వాస్తవాలను మరిచిపోయి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అనంతపురం నగర మేయర్ మొహమ్మద్ వసీం సలీం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం రాత్రి 8:30కు ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. వైయస్ఆర్సీపీ నేతలను టార్గెట్ చేసుకుని మాట్లాడడం సబబు కాదన్నారు.