ప్రకాశం జిల్లా వ్యాప్తంగా హెల్మెట్ ధరించి వాహనాలు నడుపుతామని ద్విచక్ర వాహనదారులతో ఆదివారం పోలీసు అధికారులు ప్రతిజ్ఞ చేయించారు. జిల్లాలోని జాతీయ మరియు రాష్ట్రీయ రహదారులపై జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో పోలీసు అధికారులు వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం వల్ల అనర్ధాలు ప్రమాదం జరిగిన సమయంలో తలకు తలిగే దెబ్బల వల్ల నష్టాలను వివరించారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వెనక వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు.