చోలేమర్రిలో ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరించాలని గ్రామ ప్రజలు వినతి
శ్రీ సత్య సాయి జిల్లా రొద్దం మండలం చోలేమర్రి పంచాయతీ ఎస్సీ కాలనీలో డబ్బులు చప్పుళ్లతో వినూత్నంగా ఊరేగింపుగా వెళ్లి గ్రామ సర్పంచ్కు వినతిపత్రం సమర్పించారు. బుధవారం మధ్యాహ్నం ఆర్డీటీకి FCRA ను పునరుద్ధరించాలని, అన్ని గ్రామ పంచాయతీలలో సర్పంచ్లకు ఆర్డీటీ సంస్థ తరఫున వినతిపత్రాలు ఇస్తున్నామని తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 55 ఏళ్లుగా ఆర్డీటీ పేద ప్రజలకు ఎన్నో సేవలు అందించినట్లు వివరించారు