అమ్మణ్ణి ని దర్శించుకున్న శ్రీ సిటీ డిఎస్పి శ్రీనివాసులు
- డీఎస్పీ శ్రీనివాసులను సన్మానించిన ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట డివిజన్ పరిధిలోని శ్రీ సిటీ నూతన డిఎస్పీగా బివి శ్రీనివాసులు బాధ్యతలు చేపట్టారు. అనంతరం శుక్రవారం సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి తల్లిని శ్రీ సిటీ నూతన డిఎస్పి బివి శ్రీనివాసులు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన డి.ఎస్.పి కి ఆలయ నిర్వహకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి కి డిఎస్పి శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారి ఆశీర్వచనాలు అందజేసి తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. అనంతరం నూతన డిఎస్పీగా శ్రీ సిటీకి విచ్చేసిన శ్రీనివాసులును ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్ కలిసి సాల్వాలతో సత్కరించారు. ఈ కార్యక్ర